|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 03:11 PM
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం గోరుగుట్ట తండా పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే పంచాయతీ తీర్మానం ద్వారా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు సర్పంచ్ విజయలక్ష్మి భాస్కర్ నాయక్ హెచ్చరించారు. మద్యం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి సీసాలు పగలగొట్టడం వల్ల స్థానికులకు, రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆమె తెలిపారు. యువత, గ్రామస్థులు సహకరించాలని ఆమె కోరారు. ఈ నిర్ణయం మార్చి 5, 2026 నుండి అమలులోకి రానుంది.