|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 11:36 AM
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్ *శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ 26వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *బాలింగ్ గౌతమ్ గౌడ్* గారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ గారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, లోకకళ్యాణం కోసం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ గౌడ్, గురు ప్రసాద్, రాము గౌడ్, బ్రహ్మానంద రెడ్డి, శ్రీనివాస్ మరియు నాయుడు తదితరులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.