|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:04 PM
TG: సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో డబిల్‌పూర్-మనోహరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి సుమారు 20-25 సంవత్సరాల వయసు ఉంటుందని, కుడి చేతిపై 'అమ్మ' అని పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి సంబంధీకులు సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.