|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 10:24 AM
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో గౌరవ మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ సబిహా గోసుద్దీన్ గార్ల తో కలసి పర్వత నగర్ ప్రజల పిలుపు మేరకు పర్వత నగర్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పర్యటించిన మాధవరం కృష్ణారావుమాట్లాడుతూ పర్వత్ నగర్ 1007 సర్వే నంబర్ లో ఎంతో కాలం కిందట ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారిని కొందరు వ్యక్తులు కోర్టు ఉత్తర్వుల పేరుతో నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రజలు ఎవరు భయపడొద్దని పర్యటించిన మాధవరం కృష్ణారావు భరోసా ఇచ్చారు.పేద ప్రజల ఇళ్లను లాక్కోవడం, పేదల ఇళ్లను ఏదో ఒక కారణం చెప్పి కూల్చివేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. పర్వత్ నగర్ లో స్థలాలను గుంజుకునేందుకు కొందరు చేస్తున్న కుట్రలకు ఎవరు భయాందోళనకు గురికావద్దని సూచించారు. పర్వత్ నగర్ వాసుల సమాచారంతో మంగళవారం ఉదయం స్థానిక మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తో కలిసి స్థానికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారి ఆందోళనను వ్యక్త పరిచారు. ఇంటి నెంబర్లు, ప్రాపర్టీ ట్యాక్స్ లు, విద్యుత్, మంచినీటి కనెక్షన్లు, ప్రభుత్వ అనుమతి పత్రాలు వంటివి అన్ని ఉన్నా కూడా కోర్టు ఆర్డర్ పేరుతో భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని పర్యటించిన మాధవరం కృష్ణారావు భరోసా ఇచ్చారు.