|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 10:16 AM
హైదరాబాద్ – బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రగతినగర్ ప్రాంతంలో వరుసగా ఏర్పాటు చేసుకున్న ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం . అంతేకాకుండా దీంతో పుట్‌పాత్‌పై ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నించారు. రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. అయితే షార్డ్ సర్ప్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్కడే ఉన్న కమాన్ వద్ద వరుసగా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒక ఓ దుకాణంలోమంటలు ఎగిసిపడుతూ పక్కన షాపుల్లోని సామగ్రికి అంటుకుని తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది