|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 10:10 AM
రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించామని, వీరిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా, వీరిలో 25 వేల మంది ఆధార్ కార్డు లేకుండానే జీతాలు తీసుకున్నారని సీఎం వెల్లడించారు. బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాటిపై ఆడిట్ చేయించి ఆర్థిక శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలని సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.