|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 06:18 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేని ఓ వివాహిత.. బలవన్మరణానికి పాల్పడింది. అయితే తాను చనిపోయిన తర్వాత తన పిల్లలను ఎవరూ చూసుకోరని భావించిన ఆ మహిళ.. వారిని మొదట చంపేసి.. ఆ తర్వాత తాను కూడా ప్రాణాలు విడిచింది. నవమాసాలు మోసి కన్న ఆ ఇద్దరు పసి పిల్లలను ఆ మహిళ చంపడం.. ఇప్పుడు తీవ్ర హృదయ విదారకంగా మారింది. చనిపోవడానికి ముందు సూసైడ్ లెటర్ రాసిన ఆ మహిళ.. తన భర్తతోపాటు అత్తింటివారిపై సంచలన ఆరోపణలు చేసింది. వారి వేధింపుల కారణంగానే తాను, తన పిల్లలతో కలిసి చనిపోతున్నట్లు పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఈ ఘటన జరిగింది. గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళకు మేకల మహేష్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు 2 ఏళ్ల పాప, 10 నెలల బాబు కూడా ఉన్నారు. అయితే తన భర్త, అత్తమామలతో తరచూ ఐశ్వర్యకు గొడవలు జరుగుతూనే ఉండేవి.. తన మరణానికి కారణం వాళ్లేనని ఆమె సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. ఇక ఆ లేఖలో ఐశ్వర్య తన అత్తింటివారిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన పిల్లలతో సహా తాను చనిపోవడానికి కారణం అత్తింటి వేధింపులేనని తెలిపింది.
ను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఐశ్వర్య రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి గల కారణాలను ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఐశ్వర్య రాసిన లేఖలో తన అత్తగారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన ఆత్మహత్యకు అత్తింటి వారి వేధింపులే ప్రధాన కారణమని ఆమె పేర్కొంది.
తన భర్త మేకల మహేష్.. తనను, పిల్లలను కనీసం పట్టించుకునేవాడు కాదని ఐశ్వర్య ఆరోపించింది. తమ పట్ల అత్యంత నిర్లక్ష్యంగా ఉండేవాడని.. కనీసం బట్టలు కూడా కొనివ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మేకల మహేష్.. ఆయన తల్లిదండ్రులు, సోదరి మాటలు విని.. తనపై వేధింపులకు పాల్పడేవాడని ఆరోపణలు చేసింది. తాను తన పిల్లలను బాగా చదివించాలని కలలు కన్నట్లు చెప్పిన ఐశ్వర్య.. తాను లేని పక్షంలో వారి ఆలనా పాలనా చూసేవారు ఎవరూ ఉండరని పేర్కొంది.
అందుకే తాను చనిపోయిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. వారిని కూడా తనతోనే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆత్మహత్య లేఖలో వెల్లడించింది. ఇక తమ చావులకు కారణమైన తన భర్త మేకల మహేష్‌తో పాటు.. అత్తమామలు వారి జీవితాంతం జైలులోనే ఉండాలని పేర్కొంది. అప్పుడే తనకు, తన పిల్లల ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఐశ్వర్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.