|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:42 PM
ప్రముఖ నటి రేణుదేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొంతమంది అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా కొంతమంది నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా తనపై కామెంట్లు పెడుతున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.రేణుదేశాయ్ మహిళలు, చిన్నారులు, మూగజీవాల రక్షణపై తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో నిత్యం పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల శునకాల గురించి ఆమె కొన్నిరోజుల క్రితం పెట్టిన ప్రెస్‌మీట్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వీధి కుక్కల దాడులపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు నెటిజన్లు హద్దుమీరారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.