|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:45 PM
TG: ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రమాద బీమా, రుణ బీమా సాయం సత్వరమే అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాల నుంచి అప్లికేషన్లు అందిన వెంటనే పరిశీలించి చెల్లింపులు చేయాలని డీఆర్‌డీవోలకు నిర్దేశించింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు ఈ బీమా సాయం అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.