|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 12:27 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, షాపూర్ నగర్ డివిజన్ పరిధిలో గత వారం రోజులుగా మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గమనించిన స్థానికులు, వెంటనే డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు.ప్రజల కష్టాలను చూసి తక్షణమే స్పందించిన ఆయన, అధికారులతో చర్చించినప్పటికీ ఆశించిన ఫలితం లభించలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ప్రజల సౌకర్యార్థం తన సొంత ఖర్చులతో డ్రైనేజీ లైన్ క్లీనింగ్ పనులను ప్రారంభించి, సమస్యను పరిష్కరించారు.పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్న పుప్పాల భాస్కర్ గారి సేవా దృక్పథాన్ని చూసి షాపూర్ నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.