|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 01:43 PM
తాను వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తప్పకుండా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా వ్యాఖ్యనించారు. బుధవారం వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ఆమె మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైందని, తాను కూడా రాజకీయాల్లోకి ఇక్కడి నుంచే వస్తానని ప్రకటించారు. పరకాల ప్రజల బాధలు తీరుస్తానని, ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రశాంతంగా మాట్లాడమని చెప్పడంతో నెమ్మదిగా మాట్లాడుతున్నానని, లేకపోతే మరోలా ఉండేదన్నారు. దీంతో పరకాల రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.