|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 02:47 PM
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండల కేంద్రంలో నిర్మితమైన శ్రీశ్రీశ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మెన్, మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్ లకు ఆలయ వ్యవస్థాపకులు సంగన్నగారి రవిగౌడ్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ ప్రారంభోత్సవానికి కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి పందల రాజ వంశస్తులైన రాజా నారాయణ వర్మ, రవి వర్మ హాజరుకానుండగా, ఆచార్య బ్రహ్మశ్రీ ఉన్ని కృష్ణన్ నంబూద్రి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.