|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:48 PM
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం, ఘట్కేసర్కు చెందిన కిషోర్ (40) కొండాపూర్ సమీపంలోని 'అమ్మానాన్న అనాధ సేవ ఆశ్రమం'లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటిని అమ్ముకొని కుటుంబ సభ్యులు వెళ్లిపోవడంతో, నాలుగేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళ్తానని చెప్పి వెళ్లిన కిషోర్, బుధవారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న చెట్టేరుకుంట చెరువులో శవమై తేలాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.