|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 11:17 AM
కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్ల చెరువు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలను TPCC ఉపాధ్యక్షులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ గారు, సీనియర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల జస్వంత్ రావు గారు ఇతర సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించారు. పార్క్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న వాకింగ్ ట్రాక్ & సైక్లింగ్ ట్రాక్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి గారి రానున్న పర్యటన దృష్ట్యా పనులను నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని సూచించారు. పార్క్‌ను ఉపయోగిస్తున్న వాకర్స్‌తో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, మహిళా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, NSUI, మైనారిటీ, ఎస్సీ, బీసీ సెల్ నాయకులు, దేశల్ మిత్రమండలి సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.