|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 04:00 PM
జనగణన ప్రక్రియలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. దేశ చరిత్రలోనే మొదటిసారి జనాభా లెక్కలను పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నేరుగా స్మార్ట్‌ఫోన్లలో వివరాలను నమోదు చేస్తారు. ఇది సమాచార సేకరణలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, పౌరులు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునేందుకు "సెల్ఫ్-ఎన్యూమరేషన్" పేరిట ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ మే 11కి 15 రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుందని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.