|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:30 PM
హైదరాబాద్ పహాడ్ షరీఫ్ వద్ద ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 92 ఎన్‌డీపీఎల్ మద్యం బాటిళ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నాలుగు కేసుల్లో మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసి, వారిని శుక్రవారం మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంగా గోవా తదితర ప్రాంతాల నుంచి మద్యం రవాణా చేయడం నేరమని, భవిష్యత్తులో ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.