|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:23 PM
మే నెల మొదటి వారంలో తమ పార్టీని ప్రకటిస్తామని తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అవుతుందని చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. కవిత 'బీఆర్ఎస్' అనబోయి 'బీజేపీ' అన్నట్లుగా ఉంది ఆయన వ్యాఖ్యానించారు. ఆమె పొరపాటున తమ పార్టీ పేరును పేర్కొన్నట్లుగా ఉందని అన్నారు.కవిత పార్టీని స్థాపిస్తే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్ తప్ప తమ పార్టీ కాదని ఆయన అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఏ పార్టీ నుంచి ఓడిపోయారు, ఎవరి చేతిలో ఓడిపోయారో ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని రామచందర్ రావు అన్నారు.