మామాస్ రెస్టారెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:26 PM
బీజేపీలో ఉంటూ 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా బలపడిందని, దక్షిణ తెలంగాణలో మరింత బలోపేతం కావాల్సి ఉందని అన్నారు.బీజేపీ భూస్థాపితం అవుతుందన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అర్వింద్ కొట్టిపారేశారు. “ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో మీకు తెలియదా?” అని కవితను ప్రశ్నించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, కేసులు ఉన్నందువల్లే అండగా నిలిచిందని ఆరోపించారు.