|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:06 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతిని పెద్దపల్లి జిల్లా, రామగుండంలోని 8 ఇంక్లైన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై, శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్, కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు శ్రీపాద రావు అందించిన సేవలను స్మరించుకున్నారు.