|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 03:35 PM
నారాయణపేట జిల్లా కేంద్రంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం భగత్ సింగ్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో, జిల్లా మహాసభలు మార్చి 12న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర మహాసభలు నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలలో మార్చి 24, 25 తేదీలలో జరగనున్నట్లు తెలిపారు. AIPKMS జిల్లా అధ్యక్షులు A. సలీమ్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల వల్ల వ్యవసాయ కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, దేశంలో 14 కోట్ల మంది వ్యవసాయ రంగంలో ఉన్నారని తెలిపారు.