|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:44 PM
సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మమత ఇంటి వద్దకు కాంగ్రెస్ అభ్యర్థి ర్యాలీగా వెళ్లడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఈ ఘటనపై గజ్వేల్ లో ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.