|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:33 PM
‘ఆపరేషన్ కేజీహెచ్-2’ (కర్రెగుట్ట హిల్స్-2) పేరుతో మంగళవారం సాయంత్రం నుంచి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు మరో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. సుమారు 2,000 మంది సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్ జీ (తిప్పరి తిరుపతి), అతడి సహాయకుడు కేసా సోధిలే లక్ష్యంగా ఈ వేట కొనసాగుతోంది.2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. బీజాపూర్ జిల్లా నంబి నుంచి విస్తరించిన కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ సంయుక్త బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే కర్రెగుట్టల ప్రాంతంలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.