by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:10 PM
ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ప్రాంతాలో అక్రమంగా పాత రైస్ మిల్లులో 600 బస్తాల రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖానాపురం హవేలి పోలీసుల ఆధ్వర్యంలో సోదాలు చేసి పట్టుకున్నారు.ఈ బియ్యం ఎక్కడి నుంచి సేకరించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరు ఈ పనికి పురామయించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారని, ప్రాథమికంగా షేక్ నజీర్ 28 సం,, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలనే పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసులు అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. అక్రమ వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు తరచూ నేరం చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.ర్రాష్ట్ర సరిహద్దు రవాణాపై నిఘా పెట్టామని, తనిఖీలు ముమ్మరం చేశామని ఇలాంటి అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.