![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:27 PM
హైదరాబాదులోని గచ్చిబౌలిలో 4వ కియో కరాటే ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. ఈ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కరాటే డ్రెస్ లు వేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం... వేదికగా సరదాగా స్పేరింగ్ చేశారు. అనంతరం నవ్వుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారిద్దరికీ టోర్నీ ఆర్గనైజర్స్ గౌరవ బ్లాక్ బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, కియో కరాటే పోటీలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. ఇవాళ్టి ప్రారంభోత్సవంలో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ కూడా పాల్గొని, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించింది.