![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 12:09 PM
ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. పండుగరోజు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, పండుగ వేళ బంగారం కొనేందుకు సిద్ధమైన వారికి బిగ్ షాక్ తగిలింది.గోల్డ్ రేటు మళ్లీ భారీగా పెరిగింది. ఫలితంగా 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర మళ్లీ రూ.91వేల మార్క్ ను దాటేసింది.శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 200 పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేటులో పెరుగుదల చోటు చేసుకుంది. శుక్రవారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,080 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ (శనివారం) ఔన్సు గోల్డ్ రేటు 3,085 డాలర్లకు చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 34 డాలర్ల దాటి ట్రేడింగ్ అవుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.83,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.91,200కి చేరింది.