![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 09:13 PM
పెద్దోళ్ల బియ్యం పేదలకు పంపిణీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే సాధ్యమని టి జి ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని 28వ వార్డులో సన్న బియ్యం పంపిణీని కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి టీజీఐఐసీ చైర్ పర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని, రేషన్ కార్డు ఉన్న నిరుపేదలందరికీ ధనవంతులు తినే నాణ్యమైన సన్న రకం బియ్యం అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందనన్నారు. రేషన్ దుకాణాల్లో గత ప్రభుత్వంలో నాసిరకం బియ్యం సరఫరా కావడంతో ప్రజలు ఎవరు ఆ బియ్యం తినకపోవడంతో రీసైక్లింగ్ జరగడం లేదా దళారుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతులకు సన్న రకం ధాన్యానికి రాష్ట్రంలో రైతుల వద్ద క్వింటాలుకు రూ. 500 రూపాయలు బోనస్ గా అధికంగా చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని 846 రేషన్ దుకాణాల ద్వారా 3 లక్షల 78 వేల రేషన్ కార్డులకు చెందిన 12 లక్షల పైగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తే సన్నబియ్యం లో పౌష్టికాలతో కూడిన (ఎఫ్ ఆర్ కె) బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోపాజి అనంత కిషన్, కూన సంతోష్, ప్రదీప్, డీలర్ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.