![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 12:12 PM
మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు అధ్యక్షతన ఈనెల 15న, సాయంత్రం 4 గంటలకు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే ఆవిర్భావ సభ ఉన్నందున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నాయకులు రమనగోని శంకర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ ఆధ్వర్యంలో మన ఆలోచన సాధన సమితి ఎం ఏ ఎస్ ఎస్ వాల్ పోస్టర్స్, స్టిక్కర్స్ మరియు కరపత్రాలు సోమవారం ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ లు, రాజకీయంగా, ఆర్ధికంగా, మరియు అన్ని రంగాలలో వెనుకకు నెట్టివేయడం జరిగిందని, రాష్ట్రంలో సగభాగమైన కుల వృత్తుల మీద ఆధారపడిన బీసీ కులాలు, ఉనికి ప్రశ్నార్ధకమైన భవిష్యత వెరిసి, మన ఆలోచన రూపంలో తెలంగాణ సమాజం ముందుకు వస్తుంది అని, సగటు మనిషి ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుంది అదే ఏప్రిల్ 15 హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అడుగులో అడుగు వేసి మన ఆలోచన సాధన సమితి చైతన్యంతో బీసీ ఉద్యమంలో నవశకాన్ని ఆవిష్కరించుకుందాం అనీ తెలంగాణ సమాజం ముందుకు రావాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మన ఆలోచన వ్యవస్థాపక సభ్యులు గోద మల్లికార్జున్ గౌడ్, వడ్డేపల్లి దశరథ సాగర్, దుడుకు గోవర్ధన్ నేత, గట్టు మొగులయ్య, తెలంగాణ యాదవ సంఘం వైస్ ప్రెసిడెంట్ చిలకల శ్రీనివాస్ యాదవ్, జెల్ల రమేష్, ఉష్కాగుల నాగరాజు గౌడ్, గోద పెద్ద లింగస్వామి గౌడ్, జిట్టా జనార్దన్ యాదవ్, మునుకుంట్ల శివ గౌడ్, రావుల శంకర్ రజక, రావుల మల్లేష్ రాజక మరియు బీసీ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.