![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 04:43 PM
రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ ఇంజనీర్లను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా సోమవారం కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’'ఎమర్జింగ్ టెక్నాలజీస్' కు హబ్‌గా రాష్ట్రాన్ని మార్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి మంత్రికి వివరించారు.ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్‌గా హైదరాబాద్ మారుతుంది. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.