![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 11:58 AM
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారంతా నిర్మల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.