![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 10:44 AM
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్, మే నెలల్లో వారానికి రెండు చొప్పున నడపనున్నట్లు పేర్కొంది.
సర్వీస్ వివరాలు ఇలా..
రైలు నెం-07017 (చర్లపల్లి - తిరుపతి) ఏప్రిల్ 11, 13, 18, 20 మరియు మే 4, 9 తేదీలలో రాత్రి 10:35 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ సర్వీస్ ఏప్రిల్ 6వ తేదీన కూడా కల్పించారు. ఇక రైలు నెం-07018 (తిరుపతి - చర్లపల్లి) ఏప్రిల్ 12, 14, 19, 21, 26, 28.. మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీలలో తిరుపతి నుండి సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి ఉదయం 7:10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సర్వీస్ కూడా ప్రయాణికులకు ఏప్రిల్ 7వ తేదీన కల్పించారు. మొత్తం 32 రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది.