![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 03:54 PM
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి, విద్యార్థులకు వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. అలాగే విద్యార్థులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని ఆదేశించారు. యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమి కూడా తీసుకోమని పేర్కొన్నారు.