![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:17 PM
HCU వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. 400 ఎకరాల వైపు వెళ్లేందుకు అధ్యాపకులు, విద్యార్థులు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. 'సోకాల్డ్ రేవంత్ రెడ్డి ప్రజాపాలన, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తోంది. HCU విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.