![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:37 PM
గులాబీ కంచుకోటలో 25 ఏళ్ల వైభవం వెల్లివిరియాలని BRS మాజీ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. సిద్దిపేటలో శుక్రవారం పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కనివిని ఎరగని రీతిలో BRS రజతోత్సవ బహిరంగ సభ ఉండబోతోందన్నారు.గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేటలో అని చెప్పారు. వెయ్యి మందితో విద్యార్థి, యువత పాదయాత్ర, 100 ట్రాక్టర్ల ర్యాలీతో 20 వేల మంది వరంగల్ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.