![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 02:42 PM
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవలు జరిగాయని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. తెలుగు మీడియంలో చదువుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని, గ్రూప్ 1 ఫలితాల్లో రేవంత్‌రెడ్డి తెలుగును ఖతం చేశారని మండిపడ్డారు. తెలుగు మీడియం వాళ్లు పరీక్షలు రాయొద్దని చెబితే సరిపోతుంది కదా అని రాకేశ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 రాసే అర్హత తెలుగు మీడియం వాళ్లకు లేదని చెప్పండని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.