![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:25 PM
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత తొమ్మిది రోజులుగా ఏకదాటిగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేటుకు ఇవాళ బ్రేక్ పడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా గురువారం ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ఉదయం ఔన్సు గోల్డ్ రేటు 3,145 డాలర్ల వద్ద కొనసాగింది.. అయితే, శుక్రవారం ఉధయం ఔన్సు గోల్డ్ రేటు 3,100 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ రేటు కూడా తగ్గింది.దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,740 తగ్గగా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.1,600 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 4వేలు తగ్గింది. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పుల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.84,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.91,640కు చేరింది.