![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 07:04 PM
HCU సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను(చెట్ల కొట్టి వేతను) తక్షణమే ఆపేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు విద్యార్థులు చేసిన నిరసనలకు అనుకూలంగా సుప్రీం తీర్పు ఇవ్వడంతో హెచ్‌సీయూలో సంబరాలు హోరెత్తాయి.ఈ సందర్భంగా ఈ రోజు(గురువారం) HCUలో విద్యార్థులు సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్థులంతా వర్షంలోనే పాటలు పాడుతూ, డాన్స్ లు వేస్తు సంబరాలు చేసుకున్నారు. సుప్రీం ఆదేశాలతో బీఆర్‌ఎస్ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 'ఇది విద్యార్థుల విజయం' అంటూ పోస్టులు పెడుతున్నారు.
I say that is students victo.
Achieved without active involvement from political parties or social activists.
I read their collective anger on social media. #HCU #KanchaGachibowli#SaveHCUBioDiversity#biodiversity pic.twitter.com/oSobqk1Fvw
— le changement est certain (@svmurthy) April 3, 2025