![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:46 PM
సేవ భారతి, ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈనెల 4న నారాయణపేట నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు సేవ భారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌస్ తెలిపారు.
జిల్లాలోని టెన్త్ క్లాస్, ఐటిఐ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న మరియు సమానమైన అర్హతలు వున్న విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు.