![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:15 PM
తెలంగాణలో వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయని BRS నాయకులు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. 'మేడ్చల్ లో MMTSలో మహిళపై అత్యాచారం జరిగింది. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం చేశారు. నాగర్ కర్నూల్ లో ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. జర్మనీ మహిళపై HYDలో అత్యాచారం జరిగింది' స్వయంగా CM హోం మంత్రిగా ఉన్నా ఇన్ని అత్యాచారాలు జరగడం ఏందనీ RSP ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల పైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఉదయం సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్‌కు పోలీసులు వచ్చారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్‌లకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు.