![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 10:06 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను వసూళ్లలో ఒక మైలురాయిని చేరుకుంది. నగర పరిధిలో పన్ను వసూళ్లు ఈ రోజు రూ. 2 వేల కోట్ల మార్కును అధిగమించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.జీహెచ్ఎంసీ చరిత్రలో ఆస్తి పన్ను వసూళ్లు రూ. 2 వేల కోట్లు దాటడం ఇదే మొదటిసారి అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం ద్వారా రూ. 465.07 కోట్లు వసూలయ్యాయని వెల్లడించింది.