![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:20 AM
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'రాజీవ్ యువ వికాసం' పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. గతంలో ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉన్న గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు కలెక్టర్లు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ-1 కింద రూ. 1 లక్ష, కేటగిరీ-2 కింద రూ. 2 లక్షలు, కేటగిరీ-3 కింద రూ. 3 లక్షల రుణాలను అందజేయనుండగా, వరుసగా 80 శాతం, 70 శాతం, 60 శాతం రాయితీ లభిస్తుంది.