![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 06:17 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ , సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై సీరియస్ అయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే వివరాలు సేకరించిన సీఎం . దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డిజి కొత్తకోటను ప్రభుత్వం కోరింది. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. ‘పన్నెండేళ్లుగా హెచ్‌సీఏ తో కలిసి పనిచేస్తున్నాం.. కానీ, గత రెండు సీజన్ల నుంచి తమకు చాలా వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో హెచ్‌సీఏకు 10శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం.. 50సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా ఇస్తున్నాం. కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై తర్వాత మాట్లాడుకుందామని చెప్పినా వినడం లేదు. టికెట్లు ఇస్తేగానీ బాక్స్‌లు తెరవమంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు భరించడం మా వల్ల కాదు.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం’ అంటూ ఇటీవల సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ లేఖ విడుదల చేశారు. తాజాగా దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు.