![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 10:32 AM
HYD-విజయవాడ నేషనల్ హైవేపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రూ.15, రెండువైపులా కలిపి రూ.30, బస్సు, ట్రక్కులకు రూ.50, రెండువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10కి తగ్గించారు. తగ్గిన టోల్ ఫీజులు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026 మార్చి 31వరకు కొత్త రేట్లు అమలులో ఉంటాయి.