![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 30, 2025, 10:12 AM
రాష్ట్రంలో మార్చి 31వ తేదీన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మార్చి 31న సెలవు దినంగా ప్రకటించినప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25 శాతం రాయితీ ఇవ్వనుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31వ తేదీ లోగా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.అయితే, మార్చి 30, 31 సెలవు దినాలు కావడంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు వీలు కల్పించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పని చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయి.