![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 04:07 PM
గచ్చిబౌలి భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్రం ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. ఆ భూములను వేలం వేయడం కుదరదన్న విషయం తెలిసి కూడా భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని, తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.