![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 06:20 PM
తెలంగాణలో 180 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ఒప్పందంలో భాగంగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం రవాణా చేసేందుకు కాకినాడ పోర్ట్‌లో ఓడను ప్రారంభించి మాట్లాడారు. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామన్నారు. అయితే.. 2022– -23 యాసంగి సీజన్లో టెండర్వడ్లకు సంబంధించిన మిల్లులకు అప్పగించాల్సిన బకాయిలపై లెక్కలు తీస్తున్నారు. జిల్లాల వారీగా ఎంత పంపాలనే టార్గెట్ఇంకా నిర్దేశించలేదు. గతేడాది రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిలిప్పీన్స్ అధికారులతో బియ్యం ఎగుమతిపై చర్చించారు. ఇవి పూర్తి కాగానే జిల్లాల వారీగా కేటాయింపు జరుగుతాయని సివిల్సప్లై అధికారులు తెలిపారు.