![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:53 PM
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమిపై పలువురు భూబకాసురులు కన్నేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు.శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 71లో మూడెకరాలు 4 గుంటల ప్రభుత్వ సీలింగ్ భూమి ఉంది. ఈ భూమి తమదేనని ఆదే గ్రామంలోని ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు శుక్రవారం ఉదయం ఆ స్థలం చుట్టూ ప్రహారిగోడ నిర్మాణం పనులు చేపడుతున్నారు. గమనించిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని భయపెడుతూ ఈ భూమి తమ పూర్వీకుల నుంచి తమ పేరుమీదే ఉందంటూ దబాయించారు. స్థలం చుట్టూ ఫ్రికాస్ట్ రోడ్డ నిర్మాణం చేపడుతున్నారు.
ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిపై రెవెన్యూ శాఖ అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాదారులు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ.. ఈ భూమి 2006 నుంచి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ సీలింగ్ భూమిగా ఉండటం గమనార్హం. ఈ భూమికి సంబంధించిన పత్రాలు లేకపోయినా సదరు వ్యక్తులు ఆ స్థలం తమదేనని చెప్పుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2006 నుంచి ఇప్పటివరకు కూడా ప్రభుత్వ సీలింగ్ భూమిగానే ఉందని వివరించారు. కానీ కబ్జాదారులు మాత్రం భూమిని ఆక్రమించడం కోసం చుట్టూ ప్రహారీ నిర్మాణం చేపడుతున్నారని చెబుతున్నారు. ఈ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని రెవెన్యూ అధికారులను స్థానికులు వేడుకుంటున్నారు.