|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 01:58 PM
కూకట్‌పల్లి రామకృష్ణ కాలనీలోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్‌మెంట్‌లో వింత ఘటన కలకలం రేపుతోంది. అనారోగ్యంతో మృతి చెందిన శైలజ (45) మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు 4రోజుల నుంచి ఫ్లాట్‌లోనే ఉంచుకుని గడియ పెట్టుకున్నారు. దుర్గంధం రావడంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ప్రశ్నించగా, "మృతదేహాన్ని ఐస్ బాక్స్‌లో పెట్టాం, ఉదయం క్లియర్ చేస్తాం" అని బదులిచ్చారు. దుర్గంధం వ్యాప్తి చెందడంతో కాలనీ వాసులందరూ ఆందోళన చెందుతున్నారు.రాత్రి పోలీసులు వచ్చి తలుపులు తీయమని అడిగిన ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు తలుపు తీయలేదు, ఐస్ బాక్స్ లో పెట్టుకున్నాము మేము.. ఇబ్బంది ఏంటి ఉదయం అంత క్లియర్ చేస్తామంటూ లోపల నుంచి సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు. కాలనీ మొత్తం దుర్గంధం వ్యాప్తి చెందడంతో కాలనీ వాసులందరూ ఆందోళన చెందుతున్నారు.