|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 07:55 PM
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆటో నగర్ లో మీటర్ రీడర్స్ తమ సమస్యల పరిష్కారం కోసం ఆటోనగర్ సర్కిల్ కార్యాలయానికి చేరుకుని SE సార్ ను కలిశారు. చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో డిమాండ్ల పత్రాన్ని సమర్పించారు. కాంట్రాక్ట్ విధానం నిలిపివేసి, ప్రతి నెల 30 రోజుల పూర్తి పని, స్థిరమైన ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజులుగా నిరసన కొనసాగుతున్నా అధికారుల స్పందన లేకపోవడంతో ఆందోళనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని, రేపు పాదయాత్రతో పాటు వంట-వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు ప్రకటించారు.