by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:37 PM
యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డితో యూనివర్సిటీల నూతన వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో ఇవాళ(శనివారం) భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. కొంత కాలంగా యూనివర్సిటీలపైన నమ్మకం తగ్గుతోందని..యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.