by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:37 PM
తెలంగాణలో ప్రస్తుతం 3,34,26,323 మంది ఓటర్లు.. 8 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. '4.14 లక్షల ఓటర్లను తొలగించాం. యంగ్ ఓటర్లు 4,73,838 మంది నమోదు చేసుకున్నారు. 551 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ప్రస్తుతం 35,907 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తాం. జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రకటన ఉంటుంది' అని తెలిపారు.